గ్రామంలో ఊరేగిస్తున్న ప్రజలు
ప్రజాశక్తి - పెద్దకడబూరు
మండలంలోని కల్లుకుంట గ్రామంలో కౌడే పీర్ల ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామంలో ఊరేగిస్తూ భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తాత జంగిల్ తాత గ్రామంలో ఊరేగుతూ ఆదివారం రాత్రి గ్రామ పొలాల పొలిమేర వరకు వెళ్లి సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. గ్రామ చావిడి దగ్గర సవారి మూసుకొని ఒకరికొకరు తీసుకున్నారు. అలా జరగడం వల్ల గ్రామంలో ఎలాంటి ఆటంకాలూ జరగకుండా ఉంటాయని గ్రామస్తుల నమ్మకం.










