ప్రజాశక్తి -హుకుంపేట:కార్యకర్తలు అందరూ సైనికులుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మరెడ్డి బాలకష్ణ అన్నారు. శనివారం ఆయన నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఆ పార్టీ మండల అధ్యక్షులు బి.కొండబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి బాలకృష్ణ ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మరెడ్డి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మనమందరం కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పెట్రోలు, గ్యాస్ ధర పెంపుతో అవస్థలు పడుతున్నారన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విధానాలు, ఆశయాలు, మేనిఫెస్టోపై ప్రజలకు తెలియ జేయాలన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అరకు నాయకులు నోగెల. చంద్రకళ, స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జన్ని అప్పారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు కోటి, ఏస్ బాలక్రిష్ణ, బురిడీ డేవిడ్, తదితరులు పాల్గొన్నారు...










