Oct 20,2023 23:37

బోసు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న రియాజ్‌

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌ : జనసేన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు, 38వ డివిజన్‌ కార్పొరేటర్‌ మలగా రమేష్‌ తండ్రి మలగా సుభాష్‌ చంద్రబోస్‌ (76) అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్ను మూశారు. శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగాయి. ఒంగోలులోని వారి నివాసం వద్ద జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, శ్రేయోభిలాషులు సుభాష్‌ చంద్రబోష్‌ భౌతికకాయాన్ని సందర్శించి.. ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ రియాజ్‌, క్రియాశీల సభ్యుల శిక్షణ విభాగం ఛైర్మన్‌ ఈదర హరిబాబు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జి బిఎన్‌. విజయకుమార్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ మంత్రి శ్రీను, జనసేన జిల్లా నాయకులు రాంబాబు, రాయిని రమేష్‌, కళ్యాణ్‌ ముత్యాల, ఆలా నారాయణతో పాటు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు.