ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం 139 బిసి సామాజిక తరగతుల వారీగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి పాలక మండళ్లను ప్రకటించింది. ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 12మంది డైరెక్టర్లను నియమించింది. పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు కార్పొరేషన్ పదువులను కట్టబెడుతూ ఆదివారం ప్రభుత్వం జాబితాను వెల్లడించింది. వీటిలో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో జిల్లా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. కళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా పేరాడ తిలక్, తూర్పుకాపు చైర్మన్‌గా మామిడి శ్రీకాంత్, కళింగ కోమటి/కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా అంధవరపు సూరిబాబు నియమితులయ్యారు. రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్‌గా డి.లోకేశ్వరరెడ్డి, పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పంగ కృష్ణవేణి, కూరాకుల, పొందర కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా రాజపు హైమావతి, శ్రీశయన కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా చీపురు రాణి నియమితులయ్యారు.
కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా తిలక్
టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం కణితూరు గ్రామానికి చెందిన పేరాడ తిలక్‌ను కాళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ ఎన్నికల్లో పొటీ చేసి ఓటమి చెందిన తిలక్ ఆ తర్వాత టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారని ఆశించి భంగపడ్డారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్‌కు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో తిలక్ గ్రూపు అసంతృప్తికి లోనైంది. నైరాశ్యంలో ఉన్న తిలక్‌కు సముచిత స్థానం కల్పిస్తామని సిఎం గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయనకు కళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. కళింగ సామాజిక తరగతి కేవలం ఉత్తరాంధ్రా జిల్లాలకు పరిమితమై ఉండడం వల్ల కార్పొరేషన్ పదవి పెద్దగా ప్రాధాన్యతలేని పదవే అవుతుందని ఆయన సన్నిహితులు పెదవి విరుస్తున్నారు.
కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్‌గా సూరిబాబు
కళింగ కోమట్లకు పెద్ద దిక్కుగా ఉన్న అంధవరపు వరహా నర్సింహం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సోదరుడైన అంధవరపు సూరిబాబు ప్రస్తుతం ఈ సామాజిక తరగతి నుంచి వైసిపిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కు విధేయునిగా ఉన్న సూరిబాబు డిప్యూటీ సిఎం కృష్ణదాస్, స్పీకరు తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ప్రసాదరావుతో సన్నిహితంగా ఉంటూ నగరంలో పార్టీ వ్యవహారాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ సిఇసి సభ్యునిగా కొనసాగుతున్నారు. ఈ సామాజికతరగతి కూడా ఉత్తరాంథ్ర జిల్లాలకు పరిమితమైనదే కావడంతో రాష్ట్రంలో ఇంకెవ్వరు పోటీకి నిలవలేకపోయారు. దీంతో ఆయనకు ఎట్టకేలకు సముచిత స్థానాన్ని కల్పిస్తూ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.
శ్రీశయన కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా రాణి
శ్రీశయన సామాజికతరగతి నుంచి నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన సోదరులకు అనుచరునిగా ఉన్న చీపురు కృష్ణమూర్తి భార్య రాణికి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి దక్కింది. కృష్ణదాస్ ఆశీస్సులతో ఈ పదవి వరించినట్లు రాణి కృష్ణమూర్తి తెలిపారు. నరసన్నపేట పట్టణంలోని మేజరు పంచాయతీ వార్డు మెంబరుగానూ, ఎఎంసి చైర్‌పర్సన్‌గానూ గతంలో పనిచేసిన రాణి ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మంత్రి కృష్ణదాస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాణికి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి దక్కింది.
పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కృష్ణవేణి
పోలినాటి వెలమ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుచరుల్లో ముఖ్యులైన పంగ కృష్ణవేణికి ఈ పదవి దక్కింది. మంత్రి సామాజికతరగతికి చెందిన కృష్ణవేణి కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ధర్మాన కుటుంబం వెంటే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. గ్రామస్థాయిలో ఆమె కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఎట్టకేలకు పోలినాటి వెలమ చైర్పర్సన్ పదవి ఆమెకు వరించింది.
పొందర కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా హైమావతి
కూరాకుల, పొందర కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన రాజాపు హైమవతికి దక్కింది. ఆమె భర్త అప్పన్న మంత్రి ధర్మానకు అనుచరునిగా కొనసాగుతున్నారు. సామాజికతరగతిలో రాష్ట్ర స్థాయిలో పట్టున్న అప్పన్న కుటుంబానికి ఈ పదవిని కట్టబెట్టారు.
రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్‌గా లోకేశ్వరరెడ్డి
ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి డి.లోకేశ్వరరెడ్డి రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజక వర్గ ఇన్ఛార్జిగా ఉన్న పిరియా సాయిరాజ్‌కు అనుచరునిగా ఉన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో లోకేశ్వరరెడ్డి సేవలందించారు. రెడ్డిక సామాజిక తరగతికి నియోజకవర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరడంతో లోకేశ్వరరెడ్డిని కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.
తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా మామిడి
తూర్పుకాపు, గాజుల కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా మామిడి శ్రీకాంత్‌కు చోటు దక్కింది. ఆయనకు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా అయినా.. శ్రీకాకుళంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ధర్మాన ప్రసాదరావు అనుచరునిగా ఉన్న ఆయన వైఎస్ఆర్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట నడిచారు. వైఎస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో జిల్లాలో ధర్మాన సోదరులతో కలిసి వైసిపిలో చేరారు. మరోవైపు విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబంతో ఆయనకు బంధుత్వం ఉంది. మాజీ ఎమ్మెల్యే పాలవలస రాజశేఖరానికి మేనల్లుడైన ఆయన పాతపట్నం శాసన సభ్యురాలు రెడ్డి శాంతికి దగ్గర బంధువు. తూర్పుకాపు సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న శ్రీకాంత్ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు.










