May 02,2023 09:59

న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న ఎడిజె శైలజ

         హిందూపురం : ప్రతి కార్మికుడు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి నిబద్ధతతో వ్యవహరించాలని అదనపు జిల్లా జడ్జి శైలజ సూచించారు. సోమవారం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఏపీఎస్‌ఆర్టీసీ గ్యారేజ్‌ ఆవరణంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఎడిజె పాల్గొని మాట్లాడారు. ఎంతోమంది కార్మిక నేతల త్యాగాలఫలితంగా ప్రస్తుతం కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. వత్తిలో నైపుణ్యాన్ని మెలకువలను పెంపొందించుకొని ముందడుగు వేయాలని ఆర్డీసీ సిబ్బందికి సూచించారు. ప్రతి కార్మికుడు కార్మిక చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు, ఆర్టీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ జిఆర్‌ సిద్దు, న్యాయవాదులు కళావతి, పార్వతి, రవికుమార్‌, లోక్‌ అదాలత్‌ శారద, లైజనింగ్‌ అధికారి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.