May 01,2023 23:00

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం పంచాయతీ కార్మికులు 70 మందికి సోమవారం గన్నవరం వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెయిన్‌ కోట్లను పంపిణీ చేశారు. గన్నవరం వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మడుపల్లి బాలకృష్ణ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. పంచాయతీ సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య, వాకర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వీసం ప్రసాదరావు, కోశాధికారి, గంప సాంబశివరావు, ట్రాక్‌ ఇంఛార్జి షేక్‌ మున్వర్‌ అహ్మద్‌, కార్యవర్గ సభ్యులు టంకాల జగన్‌, అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎయిర్‌ పోర్ట్‌ మాజీ డైరెక్టర్‌ ముక్కామల సుబ్బారావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరువీధి వెంకయ్య, జాస్తి తాతారావు నిడమర్తి నాగేశ్వరరావు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది అనుమోలు వెంకటేశ్వరరావు కార్మిక దినోత్సవం విశిష్టత గురించి మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు రెయిన్‌ కోట్లు అందజేసినందుకు గన్నవరం వాకర్స్‌ అసోసియేషన్‌ ను అభినందించారు.