Oct 10,2023 00:42

కాపీ పళ్ళు సేకరిస్తున్న గిరి పుత్రులు

ప్రజాశక్తి- అనంతగిరి: ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ పళ్ళ సేకరణలో రైతులు బిజీలో పడ్డారు. గత ఏడది కంటే ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల నుండి కాపీ పళ్ళు ముందస్తుగానే పండు దశకు రావడంతో కాఫీ రైతులు సేకరణలో బిజీలో పడ్డారు. పండిన కాపీ పళ్ళు చెట్టు నుండి తీయకపోతే రెండు మూడు రోజుల్లోనే చెట్టు నుండి రాలిపోతుండంటంతో ముందస్తుగానే రైతులు సేకరించి జాగ్రత్తలు పాటిస్తున్నారు. చేతికి అంది వచ్చిన ఆర్గానిక్‌ కాఫీని సేకరించి దానిని పల్పర్‌ చేసిన అనంతరం మూడు రోజులు ఆరు బయట ఎండలో ఆరవేసి రైతులు చిరు వ్యాపారస్తులకు అమ్మకాలు చేపడతారు.