ప్రజాశక్తి - ధర్మవరం టౌన్ : మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్యకార్మికులు, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కార్మికసంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్‌లో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్యకార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. విధి నిర్వహణలో ఉంటూ మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, కార్మికులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎల్‌ఆదినారాయణ, ఆయూబ్, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, మున్సిపల్ కార్మికసంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, కార్మికులు పుల్లన్న, వెంకటేశ్, లక్ష్మీ ఓబుకేశు, పెద్దక్క, దుర్గమ్మ, నరసమ్మ, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.










