Apr 08,2023 21:07

విలేకరులతో మాట్లాడుతున్న ఎఐసిసి సభ్యుడు కోటా సత్యనారాయణ

        ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌   వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే స్థాయి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదని ఎఐసిసి సభ్యుడు కోటా సత్యనారాయణ అన్నారు. శనివారం పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ అనే సంగతి తెలుసుకోవాలన్నారు. నేడు బిజెపిలోకి వెళ్లి కాంగ్రెస్‌లో ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలో పోతోందని విమర్శించడం 'తల్లి పాలు తాగి రొమ్ము' గుద్దినట్లుగా ఉందన్నారు. నీకు ఎలాగూ బుద్ధి లేదు బిజెపి వారి కైనా సిగ్గు ఉండొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కాంగ్రెస్‌లో ఎందురో సీనియర్లు ఉన్నప్పటికీ ఏ అర్హత ఉందని నీకు సీఎం పదవి వచ్చిందో చెప్పాలన్నారు. నీ పదవీకాలంలో ముగిసిన వెంటనే సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చెప్పు గుర్తుతో పోటీ చేసిన నీకు ఒక్క సీటు కూడా దక్కలేదన్నారు. ఇప్పుడు బిజెపిలోకి పోయి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ విమర్శించడం పద్ధతి కాదన్నారు. సముద్రం లాంటి పార్టీలో నీలాంటి వాళ్లు బయటకు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు.