ధ్రువపత్రం అందుకుంటున్న ఆనందరాజు
ప్రజాశక్తి -పెద్దకడబూరు
కాంగ్రెస్ మండల అధ్యక్షులుగా ఆనందరాజు, మండల ఉపాధ్యక్షులుగా జగతప్పగారి లక్ష్మన్న ఎన్నికయ్యారు. బుధవారం కర్నూలు డిసిసి అధ్యక్షులు సుధాకర్ బాబు చేతులమీదుగా మంత్రాలయం ఇన్‌ఛార్జీ బాబురావు ఆధ్వర్యంలో ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆనందరాజు మాట్లాడారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కురువ మల్లేష్, చాంద్ పీర్ పాల్గొన్నారు.










