- వెయ్య మందికి అన్నా సమారాధన
ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : చిన్న వయసులో పరిణతి కల్గిన అద్భుతమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటుడు జూనియర్ ఎన్ టి ఆర్ అని మచిలీపట్నం మండలం పోలాటిటిప్ప గ్రామ సర్పంచి మరియు మచిలీపట్నం జూనియర్ ఎన్టీఆర్ ప్రెసిడెంట్ మోకా రాజు పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం ముదిరాజు కోన గ్రామంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సినిమాలలో బాల నటుడిగా ప్రవేశించి బ్రహ్మర్షి విశ్వామిత్ర,బాల రామాయణం చిత్రాలలో గొప్ప ప్రతిభను కనబరచి ఎందరో మన్ననలను పొందారాన్నారు. సోలో హీరోగా నిన్నుచూడాలని చిత్రంతో ప్రవేసించి ఆది, సింహాద్రి సినిమాలతో గొప్ప విజయాలు అందుకొని నేడు అగ్ర కథానాయకుడు గా వెలుగొందుతున్నాడని తెలిపారు. ఈ సందర్బంగా కోన గ్రామంలో అభిమానులు యేర్పాటు చేసిన కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో వెయ్యి మందికి ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోన గ్రామ మాజీ సర్పంచులు కోమటి వెంకటేశ్వరరావు, గంజాల శ్రీరాములు,మోకా మహేష్, కోమటి బాలకృష్ణ, కోమటి రామాంజనేయులు, చిరివెళ్ళ శివనాగరాజు, గంజాల ముదిరాజు, గంజాల సాయి, పెరుమాళ్ళ రాజేష్ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.










