Aug 29,2023 21:25

కార్మికులకు సంఘీభావం తెలుపుతున్న ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి -సాలూరురూరల్‌ : లాక్‌ డౌన్‌ ప్రకటించిన ఎపి ఫైబర్స్‌ జ్యూట్‌ మిల్లును వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మికులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ప్రజాసంఘాలు, యుటి ఎఫ్‌ ప్రతినిధులు బి.విజరు కుమార్‌, ఎ.గణేష్‌, ఎపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ముక్తేశ్వర పాణిగ్రహి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కార్యదర్శి ఎన్‌వై నాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షులు నిమ్మాది చిట్టి, రూరల్‌ అధ్యక్షులు ఆముదాల పరమేష్‌ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిల్లును వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉన్న ప్రాధాన్యత, ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేస్తున్నారని, మిల్లును గత 15నెలలుగా మూత పడ్డా నేటికీ దీని గురించి స్థానిక మంత్రి దృష్టి పెట్టకపోవడం శోచనీయమన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల పోరాటాలకు తమ తరుఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు రాముడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మర్రి శ్రీనివాసరావు, ప్రజాసంఘాల నాయకులు గౌరీశంకర్‌, ప్రభాకరరావు, ఎ.తిరుపతిరావు, శ్రీనివాసరావు, జెఎసి నాయకులు తిరుపతి, సురప్పాలనాయుడు, నారాయణ రావు, శ్రీనివాసరావు, సుదర్శన రావు పాల్గొన్నారు.