Oct 05,2023 21:48

జ్యూట్‌ నాయకులకు ఆర్థికసాయాన్ని అందజేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - సాలూరు: మండలంలోని జీగిరాం జ్యూట్‌ మిల్లు కార్మికుల ఉద్యమానికి ఎపిటిఎఫ్‌ మండల, జిల్లా నాయకులు గురువారం మద్దతు పలికారు. జ్యూట్‌ మిల్లు వద్ద నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ముక్తేశ్వర పాణిగ్రాహి, జిల్లా నాయకులు నాయుడు ప్రభాకర్‌, ఎంవి గౌరీశంకర్‌ శిబిరాన్ని సందర్శించి కార్మికుల పోరాటానికి మద్దతుగా రూ.5వేలు ఆర్ధిక సాయం అందజేశారు. జెఎసి నాయకులు పువ్వుల శ్రీనివాసరావు, రెడ్డి సింహాచలం, రెడ్డి సత్యంకు 5116రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు.