Aug 24,2023 20:22

కౌతాళంలో ర్యాలీ నిర్వహిస్తున్న ప్రతిభ విద్యార్థులు

ప్రజాశక్తి - కౌతాళం
చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో ప్రతిభ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ ఆధ్వర్యంలో గురువారం కౌతాళంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలోనే భారత శాస్త్రవేత్తలు అత్యుత్తమ ఫలితాలను సాధించారని, భవిష్యత్తులోనూ ఇలాంటి ప్రయోగాలు మరిన్ని విజయవంతం కావాలని పాఠశాల కరస్పాండెంట్‌ దూద్‌ బాష ఆకాంక్షించారు. స్థానిక హైస్కూల్‌ నుంచి జాతీయ జెండాతో జయహో ఇస్రో..! అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు నినాదాలు చేసుకుంటూ పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వరి, సొసైటీ కార్యదర్శి మైనుద్దీన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.