జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య
- ఎపిడబ్ల్యుజెఎఫ్, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన
ప్రజాశక్తి - బనగానపల్లె రూరల్
కర్నూల్ నగరంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆర్‌టివి విలేకరులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఎపిడబ్ల్యుజెఎఫ్, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. విలేకరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ శ్రీనివాసులు గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు వెంకటేశ్వర్లు, రఘురాం రెడ్డి మాట్లాడుతూ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కర్నూలులో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆర్ టివి రిపోర్టర్లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుపై దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. జర్నలిస్టులు వృత్తిపరంగా వార్తలు రాస్తారే తప్ప వ్యక్తిగతంగా ఎవరిపై కక్ష ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నియోజకవర్గ ఉపాధ్యక్షులునర్సింహారెడ్డి, రామ చంద్రా రెడ్డి, కార్యదర్శి షాషావలి, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రఘు రామిరెడ్డి, మధు, కార్యదర్శి రాజేష్, సీనియర్ జర్నలిస్టు వెంకట రాముడు, జర్నలిస్టులు రమణ, నగేష్, సుబ్బయ్య, శ్రీకాంత్, రమణ, ఓబులేసు, మనోహర్, భాష, భాష, సుధాకర్, పసుపల దస్తగిరి, వెంకట రాముడు, సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు సుబ్బయ్య, సుబ్బారెడ్డి, గిరిజన సమైక్య జిల్లా అధ్యక్షులు కాలింగరి రాముడు, ఎఐటియుసి అధ్యక్షులు కుల్లాయి స్వామి, టిడిపి పట్టణ అధ్యక్షులు ఖాసిం బాబు, ముస్లిం మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు రాయలసీమ సలాం, బిజెపి కార్యదర్శి యాదగిరి, జనసేన నాయకులు షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు










