జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
ప్రజాశక్తి - చాగలమర్రి
కర్నూలు, హైదరాబాద్‌లలో జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన కడప ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు, టిడిపి, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం రీసర్వే డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు భాస్కర్‌రెడ్డి, బాలుడు, మహబూబ్ భాష, రవి, శివ, గౌస్, టిడిపి నాయకులు టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తి నర్సింహులు, జిల్లా బిసి సెల్ స్పోక్ పర్సన్ సల్లా నాగరాజు యాదవ్, గఫార్, బషీర్, టైలర్ అమీర్, శ్యాబుల్, ఇమాం హుసేన్, కసినేని ఓబులేసు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.










