పుట్టపర్తి రూరల్: హైదరాబాదులో జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శ్రీ సత్య సాయి జిల్లా జర్నలిస్టు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఎస్పీ మాధవ రెడ్డికి, కలెక్టర్ అరుణ్‌బాబుకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. వారి వాహనాలను ధ్వంసం చేయడం చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. . ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంఘం నాయకులు శ్రీనివాసులు, పుల్లయ్య, మురళి, రంగారెడ్డి, కుల్లాయప్ప, హరి తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : న్యూస్ కవరేజ్ కోసం వెళ్ని జర్నలిస్టులపై ప్రత్యక్షంగా దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్మవరంప్రెస్ క్లబ్ కమిటీ వన్ టౌన్ సీఐ సుబ్రమణ్యంకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సోమవారం ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటి అధ్యక్షుడు జానపాటిమోహన్, ప్రధానకార్యదర్శి మురళీ, సభ్యులు సీఐసుబ్రమణ్యంను కలిసి జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం ఎంపీ అవివా రెడ్డిని సీబీఐ అరెస్టుచేస్తుందన్న సమాచారంతో న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన ప్రతినిధులపై దాడిచేసి వాహనాన్ని ధ్వంసం చేయడం ఆమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పతకమూరి నాగభూషణ, రమేష్‌నాయుడు, గుండారాఘవ, సుబ్బు, కల్యాణ్, రాజా, రమణ, గోవర్దన్ రెడ్డి, దొడ్డప్ప,నరసింహులు ఉన్నారు.










