ప్రజాశక్తి-పెదబయలురూరల్:జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద పెదబయలు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొమ్మ కొండబాబు, కార్యదర్శులు సిహెచ్ మత్స్యరాజు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ముంచింగిపుట్టు: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు కాంతారు మోహన్, బి.శ్రీనులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురష్కరించుకుని స్థానిక మండల ప్రజా పరిషత్ ఆవరణ గాంధీ విగ్రహం వద్ద స్థానిక పాత్రికేయులు నిరసన చేపట్టారు. జఅనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్ పర్సన్ సుభద్రకు, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శంకర్, జి.కోటిబాబు, కె.ఈశ్వర్, కె.అనిల్, భూషణం పాల్గొన్నారు.










