జపాన్ : టెక్నాలజీతో పరుగులుపెడుతున్న ప్రపంచంలో ఇంటర్నెట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. వేగవంతంగా పనులు జరగడానికిగాను... వినియోగదారులు హై స్పీడ్ ఇంటర్నెట్ను కోరుకుంటూనే ఉంటారు. ఈ క్రమంలో... అత్యంత వేగమైన డేటాను ట్రాన్స్ఫర్ చేసేందుకు దేశాలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా... జపాన్ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను దక్కించుకుంది. జపాన్ సాధించిన ఈ ఘనతపై ఇండియన్ బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనిటీ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా భారత్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కేవలం ఒక్క సెకనులో..
జపాన్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసిటి) పరిశోధకుల బఅందం ఒక్క సెకనుకు ఏకంగా 319 టెరాబైట్ల (టిబిపిఎస్) వేగంతో ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసి విజయం సాధించింది. ఈ ఇంటర్నెట్ స్పీడ్‌తో కేవలం ఒక్క సెకనులో 57వేల సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్స్..
ఈ ఇంటర్నెట్ వేగాన్ని అందుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక ఆప్టికల్ ఫైబర్స్‌ను ఉపయోగించారు. బెంజమిన్ జె.పుట్నం నేతఅత్వంలోని పరిశోధకుల బఅందం 0.125 మి.మీ ప్రామాణిక వ్యాసంలో 4-కోర్ ఆప్టికల్ ఫైబర్ ద్వారా సుదూరదూరం మొదటి ఎస్, సీ, ఎల్-బ్యాండ్ల ద్వారా డేటాను ట్రాన్స్ఫర్ చేయడంలో విజయాన్ని సాధించారు. ఇందుకోసం పరిశోధకులు 30,001 కిలోమీటర్లకు పైగా సుదూర ట్రాన్సామిషన్ను ఏర్పాటు చేశారు.










