కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికను వైసిపి, టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి బలపరిచిన అభ్యర్థి ఆరిక గోపాల్ తరపున ఎమ్మెల్యే పాములు పుష్ప శ్రీవాణి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు ఎంపిపి శెట్టి పద్మావతి, జడ్పిటిసి జి.సుజాత, జిల్లా కోప్సన్ సభ్యులు షేక్ నిషార్, వైసిపి జిల్లా అధికారి ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, మండల కో-ఆప్షన్ సభ్యులు షేక్ జిలాని, మండల కన్వీనర్ ఐ. గౌరీ శంకర్, మైనార్టీ విభాగం నాయకులు షేక్ నూరేళ్ల, వైసిపి నాయకులు పాల్గొన్నారు. టిడిపి బలపర్చిన అభ్యర్థి కొండగొర్రి వెంకటరావు తరుపున టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి టి.జగదీశ్వరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు టిడిపి నాయకులు వెంపటాపు భారతి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు రంజిత్ కుమార్ నాయక్, టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నిమ్మక భాను ప్రసాద్ (చంటి), తోట పటయ్య తన అనుచర వర్గంతో ప్రచారం నిర్వహించారు.










