Oct 14,2023 11:50

ప్రజాశక్తి-ఉంగుటూరు : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి తీరును ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళలు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వేదిక పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేటు అని ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ వీర మహిళలు అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ వీరమహిళలుమరియు నాయకులు  పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ది చెప్పుకోవటానికి ఏమి లేక ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కోన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వుండి దిగజారుడు వ్యాఖ్యలు సరికాదని తెలిపారు .ఈ ప్రభుత్వానికి ప్రజల్లో వచ్చే వ్యతిరేకత చూసి వారిలో భయం పుట్టిందని, జనసేన పార్టీకి ప్రజల్లో వచ్చే ఆదరణ ఓర్వలేక ఈటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.