హిందూపురం : జనంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆపార నమ్మకం ఉందన్న విషయాన్ని పీపుల్స్ సర్వే ద్వారా వెల్లడి అయ్యిందని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్స్ సర్వే కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా శనివారం నియోజక వర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించి, బెంగళూరు రోడ్డులో ఉన్నా ఆర్‌కె ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నాయకులు, కార్యకర్తలతో సమావేశం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మాట్లాడుతూ జగన్ నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. ఈ సర్వేతో వైఎస్సార్‌సీపీ రాజకీయంగా బలంగా ఉందని నిరూపణ అయ్యిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటున్నామని చెప్పారు. హిందూపురం నియోజక వర్గంలో 93 వేల గృహాలు ఉంటే 86,220 గృహాలను సర్వే చేశామన్నారు. ఏ గడపకు వెళ్లినా ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, మాజీ వైసిపి సమయనకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజ, లేపాక్షి మండల కన్వీనర్ నారాయణస్వామి, వైస్ ఛైర్మన్ జబివుల్లా, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, మండల నాయకులు బసిరెడ్డి, ఎంపీపీలు, జడ్పిటిసిలు నాగభూషణం, బాణాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.










