Nov 02,2023 18:30

జింకను స్వాధీనం చేసుకొన్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : జనారణ్యంలోకి ఓ జింక ప్రవేశించింది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ గురువారం కుక్కల దాడి నుంచి తప్పించుకొన్న ఈ జింక తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో రైతు సోము వెంకటేశ్వర్‌ రెడ్డి రొయ్యల చెరువులో పడింది. చెరువులో పడ్డ ఈ జింకను రైతు వెంకటేశ్వర్‌ రెడ్డి కాపాడి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డిఎఫ్‌ఓ ఆవుల చంద్రశేఖర్‌, రేంజర్‌ మాల్యాద్రి ఆదేశాల మేరకు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పి, బాలకష్ణయ్య, ఎఫ్డిఓ శ్రీనివాసులు జింకను స్వాధీనం చేసుకొన్నారు. కుక్కల దాడిలో తగిలిన స్వల్ప గాయాలకు కోడూరు పశువైద్యశాలలో చికిత్స చేయించారు. అనంతరం నరసింహకొండ ప్రాంతంలో జింకను విడిచి పెట్టినట్లు సెక్షన్‌ ఆఫీసర్‌ బాలకష్ణ తెలిపారు.