ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం ఎస్‌ఐగా ఆర్.మల్లికార్జునరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 బ్యాచ్ నుంచి ఎస్‌ఐగా నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరంలలో పనిచేసినట్లు తెలిపారు. ఇటీవల ఉన్నతాధికారుల ఉత్తర్వులు మేరకు బదిలీపై జంగారెడ్డిగూడెం ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా కృషి చేస్తానన్నారు. నిష్పక్షపాతంగా ప్రజలకు పోలీస్ సేవలను అందిస్తానని తెలిపారు.










