అమరావతి: జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రధాని మోడీ చేస్తున్న ప్రయత్నాలకు రెరడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ససేమిరా అరటున్నారు. ఐదేళ్ల పాలనాకాలం ముగిసేరతవరకు కొత్తగా ఎన్నికలకు వెళ్లేరదుకు వారు ఇష్టపడడం లేదని సమాచారం. ఇదే అరశాన్ని కేంద్రానికి చూచాయగా చెప్పినట్లు తెలిసింది. ఎవరికివారుగా తమతమ రాజకీయ సలహాదారులు, అరతరంగికులతో ఈ విషయంపై చర్చిరచినట్లు భోగట్టా. జమిలి ఎన్నికలకు తెలుగుదేశం అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీకి 2018లో ఎన్నికలు నిర్వహిరచారు కనుక అక్కడి ప్రభుత్వానికి 2023 వరకు సమయం ఉరది. ఆరధ్రాలో 2019లో ఎన్నికలు జరిగినందువల్ల 2024 వరకు గడువుంది. ఇరత సమయం ఉన్న నేపథ్యంలో జమిలి పేరుతో 2022లోనే ఎన్నికలకు వెళ్లడం ఎరదుకన్న భావన రెరడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల నురచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వరకు టిఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పరిస్థితిల్లో జమిలికి వెళ్లడం కాకుండా అన్నిటినీ సర్దుబాటు చేసుకోవాలన్న భావాన్ని అక్కడి ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిరది. ఇదే సమయంలో ఎపిలో కూడా సంక్షేమ పథకాలు భారీగా అమలు చేస్తున్నప్పటికీ, వాటిని పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరుచుకోవాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ఈ సమయంలో కొత్తగా ఎన్నికలకు వెళ్లడం కాకుండా ఐదేళ్లు పూర్తయాకే మంచిదన్న భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిరది.
ఇలా ఉరడగా, జమిలి ఎన్నికలకు ప్రారతీయ, జాతీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది కనుక ప్రారతీయ పార్టీలదే హవా ఉరటురది. అయితే జమిలి ఎన్నికలయితే జాతీయ అంశాలకు ప్రాధాన్యత ఎక్కువగా వస్తుంది కనుక అనేక ప్రాంతీయ పార్టీలు ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అరదుకే జమిలీకి విముఖత చూపిస్తున్నట్లు తెలిసిరది. కాగా, తెలుగుదేశం, ఉభయ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు ఐదేళ్ల వరకు వేచి చూసినా పెద్దగా లాభం ఉరడదని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మురదస్తు వెళ్తే మేలన్న భావాన్ని ఆ రెరడు పార్టీలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిరది. జమిలికి సానుకూలంగా వ్యవహరిస్తే బిజెపితో మళ్లీ సత్సంబంధాలు మెరుగుపరచ్చుకోవచ్చునన్న భావన కూడా కొందరు తెలుగుదేశం నాయకులకున్నట్లు సమాచారం.










