Jun 27,2023 22:30

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాజేంద్రకుమార్‌నేగి

         పుట్టపర్తి అర్బన్‌ : జల సంరక్షణ జాతీయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జల్‌ శక్తి అభియాన్‌ సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ రాజేంద్ర కుమార్‌ నేగి పేర్కొన్నారు. మంగళవారం నాడు పుట్టపర్తి కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో నుంచి జల్‌ శక్తి అభియాన్‌పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్తవ్రేత్త రాఖీ, జాతీయ ఉపాధి హామీ పథకం జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జల్‌ శక్తి అభియాన్‌ సెంట్రల్‌ నోడల్‌ ఆఫీసర్‌ రాజేంద్ర కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో గత మూడు రోజులుగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అమలులో భాగంగా ఫారం పాండ్లు, ఇంకుడు గుంతలు, చెరువులు, పలు నీటి సంరక్షణ పనులను పరిశీలించినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలన్నారు. వర్షపు నీరు ఎక్కడ ఎప్పుడు ఎలా పడే నీటిని అక్కడే భూమిలోకి ఇంకింప జేయాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఋతుపవనాల వర్షపు నీటిని వడిసిపట్టి సంరక్షిస్తాం అన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ రామాంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి సనఉల్లా, జిల్లా గ్రౌండ్‌ వాటర్‌ అధికారి రాజశేఖర్‌ రెడ్డి, పట్టు పరిశ్రమ శాఖ జెడి.పద్మమ్మ, ఏపీఎంఐపి పీడీ సుదర్శన్‌, జిల్లా హార్టికల్చర్‌ అధికారి చంద్రశేఖర్‌, వాట్‌ రీసోర్స్‌ శాఖ డిఈఈ గంగాద్రి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆర్‌ఈవో రషీద్‌ ఖాన్‌, డీఎపడొ రవీంద్రనాథ్‌ రెడ్డి, డీఎల్పీవో శివకుమారి పాల్గొన్నారు.