Jul 14,2023 19:32

డిగ్రీ కళాశాలను బంద్‌ చేస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి - దేవనకొండ
రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ కోర్సులకు ఖరారు చేసిన ఫీజులపై విడుదలైన జిఒ 22ను రద్దు చేయాలని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ లక్ష్మణస్వామి, ప్రిన్సిపల్‌ నరేష్‌ కుమార్‌ కోరారు. రాష్ట్రవ్యాప్త ప్రయివేట్‌ డిగ్రీ కళాశాల యాజమాన్యాల నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాలను బంద్‌ చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన నూతన ఫీజులతో కళాశాలను నడపలేమని తెలిపారు. అలాగే జిఒ 22ను ఎత్తివేసి ఫీజు విధానాలను పునః పరిశీలించాలని డిమాండ్‌ చేశారు.