Apr 14,2023 22:40

gannavaram lo

జిల్లావ్యాప్తంగా అంబేద్కర్‌కు ఘననివాళి
ప్రజాశక్తి-యంత్రాంగం
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జరిగాయి. మచిలీపట్నం రూరల్‌ : జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి జనసేన పార్టీ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ, నాయకులు, జనసైనికులు ఘనంగా నివాళులర్పించారు. గడ్డం రాజు, మహమ్మద్‌ సమీర్‌, బొమ్మసాని నరేష్‌, గళ్లా తిమోతి, వంపుగడవల చౌదరి, జన్ను నాగరాజు, మహమ్మద్‌ భాషి, కొండ మేస్త్రి, కర్రీ మహేష్‌, లంకె శ్రీనివాస్‌, చిట్టూరి శివప్రసాద్‌ పాల్గొన్నారు. బంటుమిల్లి : కొమ్మారెడ్డి ఇంగ్లీషు మీడియం హైస్కూలులో పాఠశాల డైరెక్టర్‌ కొమ్మారెడ్డి కిశోర్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ములపర్రు సర్పంచి బొడ్డు మంగమ్మ, మండల కార్యదర్శి మాజేటి శివ శ్రీనివాసరావు, నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజరు ఘోష్‌, దాసరి సాల్మన్‌ రాజు, బొడ్డు నాగరాజు, పొదిలి వెంకన్న, వెంట్రపాటి రాంబాబు, వంగల రాజు, చొప్ప బాజీ పాల్గొన్నారు. గూడూరు : గూడూరుగ్రామంలోని నగరం దళితవాడలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌, ఆయన తనయుడు జోగి రాజీవ్‌ అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. పెడన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బళ్లా జ్ఞాన లింగ జ్యోత్స్న రాణి, వైస్‌ ఛైర్మెన్లు ఎం.డి. ఖాజా, బైలపాటి జ్యోతి, జెడ్పీటీసీ వేముల సురేష్‌ రంగబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.అంజయ్య, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కారుమంచి కామేశ్వరరావు, మండల పట్టణ వైసిపి అధ్యక్షులు తలుపుల వెంకట కృష్ణారావు, బండారు మల్లిఖార్జునరావు, ఫ్లోర్‌ లీడర్‌ కటకం ప్రసాద్‌, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మచిలీపట్నం రూరల్‌ : కష్ణా యూనివర్సిటీలోఉపకులపతి ప్రొఫెసర్‌ కె.రామమోహనరావు నివాళులర్పించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.రామిరెడ్డి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్‌(కృష్ణా) : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఉప్పాల హారిక, జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌ సందేశం ఇచ్చారు. దళిత సంఘాల నాయకులు బి.రామారావు, కొడాలి శర్మ, బూరుగుల రామారావు, అధ్యాపకురాలు గుంటూరు మేరి కృష్ణాబాయి, బేతపూడి మనోహర్‌ మాట్లాడారు. సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి సభకు స్వాగతం పలికారు. డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా బిసి సంక్షేమాధికారి ఎ.శ్రీనివాసరావు, జిల్లా గిరిజన అధికారి ఫణి దూర్జటి. సంక్షేమ హాస్టళ్ల కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత జెసి డాక్టర్‌ అపరాజిత సింగ్‌, నగర మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, ముడా ఛైర్‌ పర్సన్‌ బోర్రా నాగదుర్గ భవాని, వైసిపి యువనాయకులు పేర్ని కిట్టు, డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి దళిత నాయకులతో కలిసి స్థానిక లక్ష్మీటాకీస్‌ సెంటరులో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. టిడిపి ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, పొలిట్‌ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ నివాళులర్పించారు. గొర్రెపాటి గోపీచంద్‌, మరకాని సమతా కీర్తి, దేవరపల్లి అనిత, బురక బాలాజీ,యువరాజు, బండారు నాని, కొడాలి అంజయ్య , మోసయ్య, కిషోర్‌, వసంత కుమారి,నాగమ్మ ,చిన్నం శేఖర్‌ , చిలీ సుమన్‌ , జ్యోతి బాబు , గోపు సత్యనారాయణ , మరగాని పరబ్రహ్మం ,ఇలియాష్‌ షా ష , పిప్పళ్ళ వెంకన్న గారు, సలీం, అయ్యప్ప, గుమ్మడి విద్యాసాగర్‌ పాల్గొన్నారు. గన్నవరం : గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ కార్యాలయంలో వైసీపీ మండల అధ్యక్షులు పడమట సురేష్‌ ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్‌ రాణి, క్రిస్టియన్‌ మైనారిటీ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజు మాట్లాడారు. వైస్‌ ఎంపీపీ శివ నాగరాజుకుమారి, కేసరపల్లి సర్పంచ్‌ లక్ష్మీమౌనిక, అల్లాపురం సర్పంచ్‌ డొక్కు వెంకన్న బాబు, మెండెం రాంబాబు, నీలం ప్రవీణ్‌ కుమార్‌, కైలే శివ కుమార్‌, గోన్నూరు సీమయ్య, తిరివీధి రంగారావు, సర్నాల ఆంజనేయులు, చీలి నాగరాజు, లుకాక ప్రసాద్‌, కాసరనేని గోపాలరావు, కొల్లి రాజశేఖర్‌, మేచినేని బాబు, అరుణ కుమారి, నిడమర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉయ్యూరు : ఐదో వార్డులో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్‌ పరిమి సలోమి సంతోషి, పరిమి భాస్కర్‌ కుమార్‌, ఉయ్యూరు గణేష్‌, జంపన వీర శ్రీనివాస్‌, రాజులపాటి ఫణి, అజ్మతుల్లా, కౌన్సిలర్‌ పల్యాల శ్రీనివాస్‌, బూరెల నరేష్‌, కాగిత కొండ( జేమ్స్‌), నడిమింటి పైడయ్య, శ్రీను, ఏసు పాదం పాల్గొన్నారు. గన్నవరం (హనుమాన్‌ జంక్షన్‌) : బాపులపాడు ఇందిరానగర్‌, ఎంపీడీవో కార్యాలయం ఎదుట అంబేద్కర్‌ విగ్రహాలకు ఎపి నాటక అకాడమీ డైరెక్టర్‌ నక్కా గాంధీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పంచ్‌ సరిపల్లి కమల భారు, జెడ్పీటీసీ కొమరవెల్లి గంగ భవాని, ఎంపీపీ యర్రగొర్ల నగేష్‌ వైస్‌ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ : స్థానిక గౌరీశంకరపురంలోని అంబేద్కర్‌ మెమోరియల్‌ భవన్‌లో ఆదిమాంధ్ర సంఘం జిల్లా అధ్యక్షులు పొంగులేటి జయరాజు, ఆర్‌టిసి డియం రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పి.జె సంపత్‌కుమార్‌లు నివాళులర్పించారు. స్థానిక నాగవరప్పాడులో జిల్లా జైభీమ్‌ ఎస్‌సి, ఎస్‌టి వెల్ఫేర్‌ సోసైటీ ఆధ్వర్యంలో మాజీ ఐఎఫ్‌ఎస్‌ కాకోల్లు భస్మాకరరావు నివాళ్ళులర్పించారు నెహ్రూచౌక్‌ సెంటర్‌లో హిందూ మాల, క్రిస్టియన్‌ మాలల పరిరక్షణ సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రా గాబ్రియేలు ఆధ్వర్యంలో మజ్జిగా కేంద్రాన్ని చిలుకూరి రాజేంద్రప్రసాద్‌, ఉప్పలేటి రారాజు, విఆర్‌ఓ అజరు ప్రారంభించారు. స్థానిక శరత్‌ థియేటర్‌లో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నివాళులర్పించారు. వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, కారే జోషప్‌, మదాసు వెంకటలకీë, తోట రాజేష్‌, రేమల్లి నీలాకాంత్‌, నాయకులు మామిళ్ళ ఏలిషా, వెంపటి సైమన్‌, చింతల భాస్కర్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన నాయకుడు మాచర్ల రామకృష్ణ(ఆర్‌.కె) ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీచేశారు. ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర నాయకులు కంచర్ల సుధాకర్‌ ఆధ్వర్యంలో వెంపటి సైమన్‌, అత్తాటి సాల్మన్‌, విక్టర్‌పాల్‌, మమిళ్ళ ఏలిషా, కలపాల బాబురావు నివాళులర్పించారు. బిఎస్‌పి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి వారా పాపారావు, జిల్లా కార్యదర్శులు బోసుబాబు, దారం కరుణాకర్‌ నివాళులర్పించారు. గుడివాడ రూరల్‌ మండలం బిళ్ళపాడులో దళిత సంఘాల నాయకులు కర్రే వెంకటగిరి, మెండు జోజిబాబు, డాల్ఫిన్‌, శాస్త్రి, నాంచారయ్య వృద్ధులకు దుస్తులు పంపిణీచేశారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో ఎపి షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా ఆధ్యర్యంలో రక్తదానం శిభిరాన్ని అధ్యక్ష కార్యదర్శులు రేమల్లి సునీల్‌కుమార్‌, వాసుపల్లి రాజారావు, కంచర్ల మహేష్‌లు నిర్వహించారు. జి.రాజేంద్రప్రసాద్‌, . రామారావు, రవికుమార్‌, డేవిడ్‌రాజు పాల్గొన్నారు. పెదపారుపూడి : జనసేన పార్టీ పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి తాడిశెట్టి నరేష్‌ ఆధ్వర్యంలో నాయకురాలు గోవారి పవిత్ర నివాళులర్పించారు. పెదపారుపూడి, గురువిందగుంట, మహేశ్వర పురం, దూళవానిగూడెం, తంబలంపాడు, నాగాపురం, సోమవరప్పాడులో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ నివాళులర్పించారు. సీనియర్‌ నాయకులు గోళ్ళ సోమేశ్వరరావు పాల్గొన్నారు. టిడిపి పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వర్ల కుమార్‌ రాజా యలమర్రు, ఈదుల మద్దాల, పెదపారుపూడి, గురువిందగుంట, దూళవానిగూడెం, తమ్మలంపాడులో నివాళులర్పించారు. టిడిపి మండల అధ్యక్షుడు చలసాని రమేష్‌ చౌదరి, కార్యదర్శి మసిముక్కు రాంబాబు, మాజీ ఎంపీపీ కాజా విజయలక్ష్మి, నత్తా వాణి, పార్వతి, సుభద్ర పాల్గొన్నారు. పెదపారుపూడిలో సర్పంచ్‌ చప్పిడి సమీరా కిషోర్‌, మండల విలేకరుల సంఘం అధ్యక్షుడు నత్తా భూషణ్‌ కుమార్‌, అరుంధతి బంధు సంక్షేమ సేవా మండలి రాష్ట్ర అధ్యక్షుడు పెదపూడి కాంతారావు నివాళులర్పించారు. గుడ్లవల్లేరు : గుడ్లవల్లేరు ప్రధాన సెంటర్లోని విగ్రహానికి మాజీ హైకోర్టు పిపి చిత్తరువు నాగేశ్వరరావు, బిఎస్పి నియోజకవర్గ నాయకులు వారా పాపారావు, అంబేద్కర్‌ అభిమానులు, వైఎస్‌ఆర్సిపి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయవాది మెండూ మురళీ నేతత్వంలో నడబడుచున్న మెండు రూరల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ- వడ్లమాన్నాడులో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి , శివార్జున నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఫౌండర్‌, డైరెక్టర్‌ కాగిత శంకర సాంబశివరావు, మెండూ రూరల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం కో ఆర్డినేటర్‌ వీరమల్లు భవాని, కన్వీనర్లు ఫణి శ్రీ, హేమ లత, గ్రామస్తులు జంగం శివ కుమార్‌, చిలుకోటి రాము, జంగం ప్రసాద్‌, చిన్నం నాగరాజు, కటికల శేఖర్‌, కటికల సురేష్‌, కటికల కళ్యాణ్‌, కారే శ్రీనివాస్‌, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. చల్లపల్లి : మండలంలోని చింతలమడ, పుచ్చగడ్డ, గంగుల వారి పాలెం, నాదెళ్ల వారి పాలెం , నిమ్మగడ్డ తదితర గ్రామాల్లో సిపిఎం కార్యదర్శి యద్దనపూడి మధు, మహమ్మద్‌ కరిముల్లా, బండారు కోటేశ్వరరావు , గుర్రం బిక్షం, దాసి కోటేశ్వరరావు, పల్లెసుబ్బారావు, ఘంటసాల ధర్మరాజు, లంకపల్లి సత్యనారాయణ, మేడేపల్లి వెంకటేశ్వరరావు, దోవా రమణయ్య బొంతు నాగార్జున, మాతంగి లక్ష్మయ్య, మాతంగి గంగయ్య, తలారి నాగేశ్వరరావు తదితరులు నివాళులర్పించారు. మోపిదేవి: మండల పరిధిలోని కొక్కిలిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ దిడ్ల జానకి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సచివాలయం, ఎస్సీ కాలనీలోని విగ్రహం, బండికోళ్ల లంక గ్రామంలోని విగ్రహాల వద్ద పలువురు ప్రముఖులు పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలతో నివాళులర్పించారు. మోపిదేవి మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యులు చందన రంగారావు, ఎంపీటీసీ సభ్యులు దిడ్ల రాణి, గ్రామ ప్రముఖులు కంచర్ల వెంకట కృష్ణారావు నివాళులర్పించారు. కేశాని శివుడు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గుంటూరు సతీష్‌, కంచర్ల జయరావు, దోమతోటి సోమేశ్వరరావు పాల్గొన్నారు. మచిలీపట్నం రూరల్‌ : మచిలీపట్నం పరిధిలోని తాళ్లపాలెంలోని విగ్రహానికి జిల్లా ఎస్పి పి.జాషువా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పమిడిముక్కల : మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌, పామర్రు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి వర్ల కుమార్‌ రాజా, కృష్ణాపురంలో సర్పంచ్‌ వీరంకి బలుసులమ్మ, గంజాల సీతారామయ్య, గురజాలలో కొడమంచిలి మహేష్‌ మంటాడలో రమేష్‌, కొడాలి రాంబాబు నివాళులర్పించారు. అవనిగడ్డ : స్థానిక వైసిపి కార్యాలయం వద్ద, సీతాలంక వద్ద అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు పూలదండలు వేసి నివాళులర్పించారు. కడవకొల్లు నరసింహారావు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, సర్పంచ్‌ గోరుముచ్చు ఉమా, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు గుర్రం బసవయ్య, నియోజకవర్గ పార్టీ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ నలుకుర్తి పృధ్వీరాజ్‌, వైస్‌ ఎంపిపి పులిగడ్డ పిచ్చేశ్వరరావు, దిడ్ల కిరణ్‌, మండల కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ నజీర్‌ భాష, పులిగడ్డ సర్పంచ్‌ దాసరి విజరు కుమార్‌, దక్షిణ శివాలయం సర్పంచ్‌ సనక సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. టిడిపి ఆధ్వర్యంలో సీతా లంక వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌, జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్‌, జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, కర్ర సుధాకర్‌, ఘంటసాల రాజమోహనరావు, మెగా వత్తు గోపి, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు బండే నాగ వెంకట కనకదుర్గ, విశ్వనాథపల్లి పాప, బండి రాఘవ నివాళులర్పించారు. గాంధీ క్షేత్రం కార్యదర్శి మతి శ్రీనివాసరావు, బర్మా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అవనిగడ్డలోని నిరాహార దీక్ష శిబిరం వద్ద అంబేద్కర్‌ చిత్రపటానికి జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ నివాళులర్పించారు. జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు గుడివాడ శేషుబాబు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ది డ్ల వీర రాఘవులు, మైనార్టీ సెల్‌ నాయకులు మహమ్మద్‌ గౌస్‌ నివాళులర్పించారు. సబ్‌ కోర్ట్‌ సెంటర్లోని బార్‌ అసోసియేషన్‌ హాలులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కనక రఘురాం ప్రసాద్‌, న్యాయవాదులు అందే శివరామకృష్ణ, బడే వెంకట శేషగిరిరావు, పరుచూరి రాఘవేంద్రరావు, కొండవీటి ఈశ్వరరావు, కర్ర సుధాకర్‌, రాయపూడి వేణుగోపాలరావు, తిమ్మన సుబ్బారావు, నరహరిశెట్టి ఈశ్వరరావు, కోలా బాలాజీ, దామెర్ల నాగరాజు, తోట వీరబాబు, తుంగల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పర్చూరు హనుమాన్‌ రామకృష్ణ, సిరివెళ్ల రవి, బడే రఘు కుమార్‌, ఎంవివి నాగార్జున, తాడేపల్లి రంగనాథ్‌ పాల్గొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ తుంగల సుమతీ దేవి నివాళులర్పించారు. జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, కోఆప్షన్‌ సభ్యులు షేక్‌ నజీర్‌ భాష, ఎంపిటిసి సభ్యులు బొప్పన భాను, తోట గణేష్‌, అవనిగడ్డ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అవనిగడ్డ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో అధికారి జే.ప్రభుదాస్‌ నివాళులర్పించారు. పాఠకులు, సిబ్బంది పాల్గొన్నారు.