Sep 24,2023 22:10

ప్రజాశక్తి - కొయ్యలగూడెం
   జిల్లాస్థాయి ఆటలకు మండలంలోని వివిధ జడ్‌పి హైస్కూల్‌ విద్యార్థులు ఎంపికయ్యారని ఎంఇఒ తెలిపారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం మండలంలో ఈనెల 22 వరకు నిర్వహించిన పోలవరం నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలలో వీరు ఎంపికయ్యారన్నారు. త్రోబాల్‌, వాలీబాల్‌, ఖోఖో, టెన్నీస్‌, టెన్నీ కాయిట్‌ జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు.