జిల్లా పశుసంవర్ధక అధికారి రత్నాకర్
ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా జె.రత్నాకర్ శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రత్నాకర్ పార్వతీపురం సహాయ సంచాలకులుగా పనిచేస్తూ ఉద్యో గ్నోతిపై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నియమితులయ్యారు. జిల్లాలో పశుసంవర్ధక అంశాల పట్ల శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పాడిపశువుల సంపద పెంచడమే కాకుండా రైతులకు ఆదాయం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.










