జిల్లా ఎస్‌పికి ఇండియన్ పోలీస్ మెడల్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి 2021లో ఇంటెలిజెన్స్ విభాగంలో చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికైయ్యారు. మంగళవారం విజయ వాడలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండియన్ పోలీస్ మెడల్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా ఎస్‌పి అందుకున్నారు. ఇండియన్ పోలీస్ మెడల్ జిల్లా ఎస్పీ అందుకోవడం పట్ల పలువురు పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.
మండ్లెం గ్రామ వాసికి శౌర్య పతాకం
నందికొట్కూరు : జూపాడుబంగ్లా మండలం లోని మండ్లెం గ్రామానికి చెందిన గ్రేహౌండ్ కానిస్టేబుల్ సయ్యద్ హబీబుల్లా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శౌర్య పతకం అందుకున్నారు. ఈ పతకం రావడం సంతోషంగా ఉందని సయ్యద్ హబీబుల్లా హర్షం వ్యక్తం చేశారు.










