Apr 10,2023 23:03

బాధ్యతలు స్వీకరిస్తున్న నూతన కలెక్టర్‌ అరుణ్‌బాబు

      పుట్టపర్తి అర్బన్‌ : అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కష్టపడి పని చేస్తానని నూతన కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు తెలిపారు. సోమవారం సాయంత్రం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను రాయలసీమలో మొదటిసారి పనిచేస్తున్నానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. జిల్లా అభివద్ధి కోసం అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని పనిచేస్తానన్నారు. అనంతరం శ్రీ సత్య సాయి ఆలయాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. నూతన కలెక్టర్‌కు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.