ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాష్ట్ర ప్రభుత్వం 2023-24 పంటల బీమాపై జారీ చేసిన 660 జిఓ రద్దు చేయాలని ఆంధ్రప్రదశ్ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రైతుసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగవంగా కలెక్టర్ ఎం.గౌతమి ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండటంతో రైతు సంఘం నేతలు ఏఓను కలిసి సమస్యలపై విజ్ఞాపన పత్రాన్ని అందించి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 నుంచి 2023 వరకూ మూడేళ్ల పంటల బీమా అమలు అనుభవం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పంటల బీమా అమలు చేసిన 2020-21లో రూ.1700 కోట్లు, 2021-22లో రూ.2900 కోట్లు, రైతులకు పంటల బీమా రూపంలో ప్రయోజనం కలిగించిందన్నారు. ఉన్నతలో రైతులకు ఎక్కువ ప్రయోజనం కలిగిందన్నారు. 2022-23లో ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు జరిగి పంటలు బీమా పథకం వలన రైతులకు కేవలం రూ.1100 కోట్లు మాత్రమే బీమా పరిహారం వచ్చిందన్నారు. ఈ అనుభవం దృష్ట్యా పంటల బీమాలో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కావున రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం కోసం 8-9-2023 విడుదల చేసిన 660 జిఓ రద్దు చేయాలి కోరారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాలు చేకూర్చేలా ఉంది తప్పా రైతులకు మేలు చేసేలా లేదని, ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకాన్ని నిలిపివేయాలన్నారు. బీమా అమలు కాని రైతులందరికి పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపి రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు బిహెచ్.రాయుడు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.పోతులయ్య, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఏఓ శ్రీధర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎపి రైతుసంఘంనాయకులు










