Sep 14,2023 21:02

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గుమ్మనూరు

ప్రజాశక్తి - హోళగుంద
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. గురువారం మండలంలోని పెద్ద గోనెహాలు, మడ్డి లింగరహళ్లి గ్రామాల్లో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ప్రతి హామీని నెరవేర్చారని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా రెండు గ్రామాలకు కలిపి రూ.9.20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పేదల అవసరాలను గుర్తించి ఏ పథకాలకైతే అర్హులవుతారో, ఆ పథకాలను అవినీతికి తావు లేకుండా అందించినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, హోళగుంద ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసిపి తాలూకా ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణస్వామి, దేవరగట్టు ఆలయ కమిటీ ఛైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు పాల్గొన్నారు.