మైనార్టీలతో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని వైసిపి రీజనల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ రామసుబ్బా రెడ్డి, ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, కర్నూలు మేయర్ బివై.రామయ్య, జడ్‌పి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని 11, 18వ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అండగా నిలిచి అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వైసిపి సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, కౌన్సిలర్లు బోయ రంగమ్మ, నాయకులు వినరు, సోమేష్, రియాజ్, రసూల్ పాల్గొన్నారు.










