Sep 01,2023 20:10

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి - దేవనకొండ
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలోని పల్లెదొడ్డి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. మంత్రి జయరామ్‌, ఆయన సోదరులు శ్రీనివాసులు, నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా రూ.42 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, గ్రామ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ప్రారంభించారు. పల్లెదొడ్డి, గద్దెరాళ్ల గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పల్లెదొడ్డి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 'గడపగడపకు' మంజూరయ్యే నిధులతో ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. తహశీల్దార్‌ వెంకటేష్‌ నాయక్‌, ఎఒ సురేష్‌ బాబు, ఎపిఒ కృష్ణమూర్తి, ఎపిఎం రమేష్‌, జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి భర్త లుముంబా, వైసిపి మండల కన్వీనర్‌ కప్పట్రాళ్ల మల్లికార్జున, సర్పంచి రంగస్వామి, తెర్నేకల్‌ సర్పంచి అరుణ్‌ కుమార్‌, వైసిపి నాయకులు దివాకర్‌ నాయుడు, ప్రేమ నాథ్‌ రెడ్డి, మదన్‌ మోహన్‌ రెడ్డి, టోపీ యూసుఫ్‌ బాష, రామచంద్ర, చంద్రన్న, కొత్తపేట బాబు, తిమ్మప్ప పాల్గొన్నారు.