ప్రజాశక్తి - హాలహర్వి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేశారని వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. శనివారం హాలహర్వి మండలం చత్రగుడిలో వైసిపి మండల కన్వీనర్ భీమప్ప ఆధ్వర్యంలో 'ఎపికి జగనే కావాలి' నిర్వహించారు. ఎంపిపి నెట్టికంటమ్మ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడారు. నవంబర్ 1 నుంచి మండలంలో నెలరోజులు ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకొని మండల కన్వీనర్ విజయవంతం చేయాలని సూచించారు. ఈ ఆరు నెలల్లో వైసిపి ప్రభుత్వం ఏ ఇంటికైతే లబ్ధి చేకూర్చిందో ఆ వివరాలన్నీ ఆ కుటుంబ పెద్దలకు తెలియజేయాలన్నారు. చంద్రబాబు పాలన, జగన్ పాలన ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకొని కుటుంబ యజమాని ద్వారా బుక్‌లెట్‌లో ముద్ర వేయించుకోవాలని తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న గుమ్మనూరు నారాయణస్వామి










