ప్రజాశక్తి - పెద్దకడబూరు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే పేదల అభివృద్ధి సాధ్యమని, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్‌ను ఆశీర్వదించాలని వైసిపి యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని చిన్నతుంబలం గ్రామంలో ఎంపిడిఒ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులై ఉండి పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. గ్రామంలో తాగునీటి, డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని ప్రజలు ప్రదీప్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించి ఆయన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, సొసైటీ అధ్యక్షులు రవీంద్ర, మాజీ ఎంపిటిసి ఎల్లప్ప, నాయకులు గజేంద్రరెడ్డి, శివరామిరెడ్డి, పూజారి ఈరన్న, జాము మూకయ్య, చంద్రశేఖర్, ముక్కరన్న, అర్లప్ప, తెలుగు చిన్న వీరేష్, కడబూరప్ప, యోహాను, లక్ష్మన్న, షాదిక్ బాష, ఎఇలు మల్లయ్య, వేణు గోపాల్, సాయికుమార్, ఎపిఒ రామన్న పాల్గొన్నారు.
అధికారులతో మాట్లాడుతున్న ప్రదీప్‌రెడ్డి










