Sep 16,2023 15:44

ప్రజాశక్తి-పెదబయలు : అరడ కోట పంచాయతీ పురుగోడుపుట్టు గ్రామంలో స్థానిక వైద్యురాలు చిట్టాపలి సిందూరం పడాల్ ఆధ్వర్యంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారి రమేష్ బాబు నోడల్ అధికారి హాజరై జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎ ఎన్ ఏం పనీతిరు ఆశ వర్కర్లు మందులు ఇచ్చే తిరును పరిశీలించారు. వర్షాకాలంతో వ్యాధులు ప్రభాలే అవకాశం ఉందని అప్రమతంగా ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఘర్భిణీ స్త్రీలు హాస్పిటల్ ల్లో ప్రసవం జరిపించాలని  సూచించారు. ఈకార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజార్స్ వంతల మూర్తి డి ఎస్ ఓ కైలాష్ బాబు పి హెచ్ ఎన్ పార్వతమ్మ హెచ్ వి కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.