Jul 26,2023 14:30
  • వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి 

 ప్రజాశక్తి-మంత్రాలయం : జగనన్న సురక్ష తో లబ్ధిదారుల చెంతకు సేవలు చేరుతున్నాయని వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలోను మండల కేంద్రమైన మంత్రాలయంలోని సచివాలయం 3 పరిధిలోని లోను ఎంపిడిఓ మనిమంజరి అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను తెచ్చి గ్రామాల్లోనే ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, రాంపురం రెడ్డి సోదరుల ఎవరికీ ఎప్పుడు ఎలాంటి సేవలు అవసరమైనా అధికారుల సహకారంతో అందిస్తున్నారు తెలిపారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి కి వారు కృషి చేయాలన్నారని కొనియాడారు. ఈ మంజూరైన వివిధ దృవీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు బెస్త అంజినయ్య, తెల్లబండ్ల భీమయ్య మండల సచివాలయ కో కన్వీనర్ వికేసి రాఘవేంద్రాచారి, తహసీల్దార్ చంద్రశేఖర్ చెట్నిహల్లి గ్రామ ఎంపిటిసి రామాంజనేయులు, మాజీ సర్పంచ్ అల్లింగప్ప గ్రామ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.