ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్లు పంపిణీ చేస్తున్నట్లు ఏఎన్ఎంలు పుష్పవతి, లక్ష్మీ, ఎంఎల్హెచ్పి కృష్ణవేణి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం మండలం పరిధిలో పెద్దహరివనం గ్రామంలో వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సర్వేతోపాటు ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్లు అందజేశామన్నారు. ఈనెల 27వ తేదీన జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్యాంపుకు వైద్యుల బృందం హాజరవుతారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందజేయడం ప్రజలందరికీ ఆరోగ్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ధ్యేయం అని ప్రజలకు తెలియజేశారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు 27 తేదీన గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాలంటరీలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.










