Jul 01,2023 16:08

ప్రజాశక్తి-ఘంటసాల : జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జెసి ఘంటసాల మండల పరిధిలోని తెలుగురావురాపాలెం గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ శనివారం పాల్గొని అర్జీదారులకు పలు రకాల సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు. పలు అర్జీలను ఆమె స్వయంగా స్వీకరించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష పథకం ప్రజలకు ఎంతో మేలుకరంగా ఉంటుందని తెలిపారు. తెలుగురావుపాలెం సచివాలయం పరిధిలో మొత్తం 543 అర్జీలు స్వీకరించగా, 533 సర్టిఫికెట్లు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆర్డిఓ కిషోర్, తహాసీల్దార్ బి రామానాయక్, ఏఎంసీ చైర్మన్ వేమూరి వెంకట్రావు, సచివాలయం మండల కన్వీనర్ వేమూరి ప్రవీణ్, సర్పంచ్ రాచూరి ప్రసాద్ బాబు, రెవిన్యూ, పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.