Oct 04,2023 10:12

ప్రజాశక్తి-ఉంగుటూరు(ఏలూరు) : జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా మెడికల్ క్యాంపు నల్లమాడు పంచాయతీ పరిధి రామచంద్రపురంలో బుధవారం నిర్వహించారు. గోపాలపురం సచివాలయ పరిధిలో నల్లమాడు, రామచంద్రపురం, గోపాలపురం, పందిరెడ్డిగూడెం ఈ నాలుగు గ్రామాల ప్రజలకు 270 మందికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత వైద్యులు వచ్చారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు . ప్రజా ప్రతినిధులు ,ఆరోగ్య ,అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.