ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు జిల్లా వైసిపి జెసిఎస్ మండల, క్లస్టర్ ఇంచార్జీల, జగనన్న ఆరోగ్య సురక్ష శిక్షణా కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు కర్నూల్ నగరం, బిర్లా కాంపౌండ్, జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నామని జేసిఎస్ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి, జెసిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వం సలహాదారులు చల్లా మధుసూదన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు మేయర్ బి.వై రామయ్య హాజరవుతారని, తప్పకుండా ఇంచార్జీలు అందరూ హాజరు కావాలని కోరారు.










