Oct 04,2023 15:44
  • మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-ఉరవకొండ : రాష్ట్రంలో ప్రతి ఇంటిని,ప్రతి కుటుంబాన్ని,ప్రతి వ్యక్తిని ఆరోగ్యపరంగా సురక్షితంగా ఉంచి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అందుకే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో సర్పంచ్ వంశీ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎంపీపీ చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, బెస్త, కురుబ కార్పొరేషన్ల డైరెక్టర్లు రమణ, గోవిందు, ఎంపిడిఓ అమృత్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విదంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో విద్యా,వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గడిచిన నాలుగేళ్ళ లో వైద్య రంగంలో 57 వేల ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు ఆసుపత్రిల అభివృద్ధికి దాదాపు 4వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసారన్నారు. ఇప్పుడు ఆరోగ్య సురక్ష పేరుతో 10,700 వైద్య శిబిరాలు ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విదంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల ఇళ్ల వద్దకే కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విశ్వేశ్వరరెడ్డి కోరారు. అనంతరం వైద్య పరీక్షలను పరిశీలించారు. శిబిరానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. ఆయన కూడా బిపి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగమ్మ, తండా సర్పంచ్ అన్నపూర్ణ, ఎంపీటీసీ చిట్టెమ్మ, పార్టీ రూరల్ అధ్యక్షుడు సుంకన్న, మండల సమన్వయకర్త ఓబన్న, నాయకులు రామూర్తి, వెంకటేష్ నాయక్, ప్రసాద్ నాయక్, నాగరాజు నాయక్,బెల్లం వెంకటేష్,రామదాసు, గోపాల్, వైద్యులు, సచివాలయ, వైద్య సిబ్బంది,ఆశా వర్కర్లు, వలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.