ప్రజాశక్తి-ఉంగుటూరు(ఏలూరు జిల్లా): అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, బాలామృతం తదితర పథకాలను సద్వినీయోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రేమాన్విత కోరారు. బుధవారం రామచంద్రపురంలో మెడికల్ క్యాంపులో అంగన్వాడి చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పౌష్టికాహారం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌతు రాము, ఎంపీటీసీ సభ్యుడు గౌతు శ్రీనివాస్, డిప్యూటీ తాసిల్దారు బొడ్డేపల్లి ప్రసాద్, డాక్టర్ పెనుగొండ బాలకృష్ణ, అంగన్వాడి చేబ్రోలు సెక్టార్ సూపర్ వైజర్ శారదా,అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.










