Jun 26,2023 22:04

అర్జీలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ లో నిర్వహించిన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి 240 వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌ చేతన్‌, డిఆర్‌ఒ కొండయ్య, ఆర్‌డిఒ భాగ్యరేఖ, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలన్నారు. గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరు కుమార్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు. డిపిఒ విజరు కుమార్‌, డిఎంహెచ్‌ఒ కృష్ణారెడ్డి, ల్యాండ్స్‌ సర్వే ఎడి రామకృష్ణ, బిసి వెల్ఫేర్‌ డిడి నిర్మల జ్యోతి, సోషల్‌ వెల్ఫేర్‌ డిడి శివ రంగ ప్రసాద్‌ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.