Jul 07,2023 19:50

జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

        గాండ్లపెంట;ప్రజల సమస్యల పరిష్కారం కోసమే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కదిరి ఎమ్మెల్యే డా||పివి.సిద్ధారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజలకు అందించేందుకు వాలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారులకూ 11 రకాల సేవలను ఉచితంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో యాదవేంద్ర, ఇఒఆర్‌డి సునీత, ఎంపీపీ టి.జగన్మోహన్‌, వైసీపీ మండల కన్వీనర్‌ పోరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి. జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు ఫయాజ్‌, మాజీ జెడ్పీటీసీ భాస్కర్‌రెడ్డి. రవీంద్రారెడ్డితో పాటు సచివాలయ కన్వీనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగన్న సురక్ష పథకం కార్యక్రమాన్ని కదిరి మండల పరిధిలోని కదిరికుంట్లపల్లిలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి మండల పరిషత్‌ అధ్యక్షులు తోట అమర్నాథ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు జగనన్న సురక్ష పథకంను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ పిఎం కిసాన్‌, రైతు భరోసా ఇతర సంక్షేమ పథకాల కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇకెవైసి చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కదిరికుంట్లపల్లి సర్పంచి రజనీష్‌ కుమార్‌ రెడ్డి, చలమకుంట్లపల్లి సర్పంచి నారపరెడ్డి, ఎంపీడీవో అంజనప్ప, మండల పరిపాలన అధికారి వెంకటనారాయణ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.