Oct 17,2023 00:35
జగనన్న సురక్ష ప్రారంభిస్తున్న తాళ్లూరు జడ్పీటీసీ వెంకటరెడ్డి

పజాశక్తి-దర్శి: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని తాళ్లూరు జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి అన్నారు. సోమవారం తాళ్లూరు సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష ప్రతి ఇంటికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదే విధంగా దర్శి మండలం లంకోజనపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్‌ కొరివి చిన్నకోటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డీటీ రవిశంకర్‌, ఈవోఆర్డీ శోభన్‌బాబు, వైస్‌ ఎంపీపీ కొరివి ముసలయ్య, తాళ్లూరు వైస్‌ ఎంపీపీలు ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి, నాగార్జునరెడ్డి, సర్పంచ్‌ చార్లస్‌ సర్జన్‌, మండల పార్టీ అధ్యక్షులు తూము సుబ్బారెడ్డి, డాక్టర్‌ మస్తాన్‌బి, ప్రజలు పాల్గొన్నారు.
సిఎస్‌ పురం: జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి పేదవానికి ఎంతో ముఖ్యమని ఎంపిపి మూడమంచు వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని బోయమడుగుల పంచాయతీలో జగనన్న సురక్ష ఆరోగ్య కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజల ఆరోగ్యం మెరుగుపరుచుకొనే ఒక మంచి కార్యక్రమాన్ని సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం సచివాలయ పరిధిలోని రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు పి వెంకటయ్య, ఎంపిటిసి సభ్యులు బి తిరుపతిరెడ్డి, మండల యూత్‌ అధ్యక్షులు ఎం అటేలయ్య, సర్పంచి బొట్ల చిరంజీవి, సింగిల్‌విండో అధ్యక్షులు పెరుగు సుబ్బరామయ్య, ఇఒఆర్‌డి సుందరరామయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లెం కొండయ్య, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.