మడకశిర : వైసిపి ప్రభుత్వం చేపట్టిన జగనన్న సురక్ష పథకం పచ్చిబూటకమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. స్థానిక బాలాజీ నగర్‌లోని టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు. విద్యుత్‌ఛార్జీలను విపరీతంగా పెంచి పేదల నడ్డివిరిచారన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, పట్టణ అధ్యక్షులు మనోహర్, మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మంజునాథ్,నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, క్లస్టర్ ఇన్‌ఛార్జి కన్నా, ప్రధాన కార్యదర్శి కోట్ల రంగే గౌడ, నియోజకవర్గ మీడియా కో ఆర్డినెటర్ బెగార్లపల్లి రవికుమార్, వైబీ హళ్లి రవీంద్ర రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.










